నేడు మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ
జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ
నేడు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ, మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈరోజు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ

నేడు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ, మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈరోజు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల(ts-liquor-shops) ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అయితే వచ్చిన దరఖాస్తులకు నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు.
-
34 కేంద్రాలలో వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి

మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీడ్రా నిర్వహణకు ఆబ్కారీశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ లక్కీడ్రాలో మద్యం దుఖాణాలు ఎవరికీ దక్కుతాయో తేలనుంది.
