పోలీసు త్యాగాలకు గౌరవ వందనం
పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ కార్యక్రమాలలో నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది.


-   
- పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి.
 -   
- పోలీసు త్యాగాలకు గౌరవంగా ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి.
 -   
- డ్రగ్స్ తో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది.
 -   
- వ్యసనాలకు అలవాటు పడవద్దు.
 -   
- బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు పట్టణ పౌరులు, యువత
 
సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు హాజరై అధనపు ఎస్పి రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి లతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు, ఈ ర్యాలీ ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా, PSR సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, MG రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు జరిగినది. కొత్త బస్టాండ్ వద్ద పౌరులతో జై జావాన్ , జై కిసాన్, జై పోలీస్ అంటూ, పోలీసు అమరవీరుల ఆశయాలను సాధిస్తాం అని పౌరులతో కలిసి నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా ఎస్పి నరసింహ గారు మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని సదుద్దేశంతో మరియు పోలీసులు చేసే కఠినతరమైన విధులను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని. ప్రతి పౌరుడు పోలీసు సమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, పోలీసు త్యాగాలకు గుర్తుగా ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు, పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ, నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండటానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అత్యంత ప్రమాదకరంగా మారిందని వీటిని క్షేత్రస్థాయిలో నిర్మూలించడంలో పోలీసులు పౌరులు ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. యువత దేశ భవిష్యత్తు అని యువత చెడు మార్గంలో వెళ్ళవద్దని గాంజాయ్ డ్రగ్స్ కు అలవాటు పడవద్దు అని ఈ సందర్భంగా ఎస్పీ గారు కోరారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, AR DSP నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్, CI లు, RI నారాయణ రాజు, SI లు, RSI లు k అశోక్, ఎం అశోక్, సురేష్, సాయిరాం, రాజశేఖర్, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
