మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కీలక సమావేశం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల కీలక సమావేశం

హైదరాబాద్ 26 : మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల కీలక సమావేశం. సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి , బత్తుల లక్ష్మా రెడ్డి, జయవీర్ రెడ్డి , బెల్లయ్య నాయక్ ,శివసేన రెడ్డి , గిరిధర్ రెడ్డి,గుత్తా అమిత్ రెడ్డి,ఎగ్గే మల్లేశం ,లక్ష్మణ్ యాదవ్, ఝాన్సీ రెడ్డి , కుస్రు పాషా ,సంజయ్ గౌడ్ , డివిజన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-   
నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారాన్ని మరింత వేగవంతం
 
తమ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేలా కార్యాచరణ చేయాలని నిర్ణయం తెసుకున్నారు.
-   
ముఖ్యమంత్రి గారి రోడ్ షో తో మరింత జోష్ నింపేలా కార్యాచరణ.
 
ప్రచారం యూసుఫ్ గూడా డివిజన్ లోని ప్రతి కాలని లో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని ,లోకల్ క్యాడర్ లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది అని మరింత ఉత్సాహం నింపాలి. ప్రతి 100 ఓట్లకు ఒక ఇంచార్జి ను ఏర్పాటు చేసుకొని పోలింగ్ రోజు ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసేలా కార్యాచరణ....
-   
పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రజల్లో అవగాహన
 
యూసుఫ్ గూడా డివిజన్ లో భారీ మెజారిటీ వచ్చేలా కార్యాచరణ చేయాలని, పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రజలలో అవగాహన పెంచాలని మంత్రి పొన్నం ఈ మీటింగ్ లో తెలిపారు.
